Female Story Writers  మహిళా కథా రచయితలు Male Story Writers  పురుష కథా రచయితలు
ప్రపంచ తెలుగు మహా సభలు డిసెంబర్ 2012లో తిరుపతిలో జరగనున్నాయి.
Writer Satyavati Honored with ‘Susheela Narayana Reddy Cultural Award’ on 19th Jan 2012 రసమయి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సుప్రసిద్ద రచయిత్రి సత్యవతి గారికి ‘సుశీలానారాయణ రెడ్డి’ సాహితీ పురస్కార ప్రధానోత్సవం


1-4-880/2/36/1, Bakaram,
Mobile No: 9848014793

Contact: 040-27641929, 27642939
Gandhi Nagar
Hyderabad
Pin: 500080
Content Text Back to Menu
Writer Satyavati Honored with ‘Susheela Narayana Reddy Cultural Award’ on 19th Jan 2012

రసమయి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సుప్రసిద్ద రచయిత్రి సత్యవతి గారికి ‘సుశీలానారాయణ రెడ్డి’ సాహితీ పురస్కార ప్రధానోత్సవం


రసమయి సంస్థ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో డా. సి. నారాయణ రెడ్డి  సతీమణి జ్ఞానకార్ధం ప్రతి ఏటా అందజేసే ‘సుశీలానారాయణ రెడ్డి’ సాహితీ పురస్కారాన్ని 19 జనవరి 2012 న ప్రదానం చేశారు.
తన భార్య సుశీలతో ఉన్న అనుబంధాన్ని, ఆమె వ్యక్తిత్వాన్ని, సాహిత్యం పట్ల ఆమెకున్న ఆసక్తిని గురించి సినారె తనదైన శైలిలో ఆవిష్కరించారు.  సాహితీ వేత్త డా. మృణాలిని పురస్కార గ్రహీతను పరిచయం చేయగా రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి సత్యవతి వ్యక్తిత్వాన్ని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రి గల్లా అరుణకుమారి మాట్లాడుతూ స్త్రీవాద రచయిత్రులు వెలుగులోకి వచ్చిన తరువాత మహిళల్లో చైతన్యం పెరిగినప్పటికీ వివక్ష అనేది వెంటాడుతూనే ఉందన్నారు.  సినారే వంటి మహాకవి, రచయిత మహిళా సాహితీమూర్తులను గౌరవించడం హర్షనీయం అన్నారు. పురస్కార గ్రహీత సత్యవతి మాట్లాడుతూ ఈ పురస్కారం తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని, మరిన్ని మంచి రచనలు చేయడానికి కృషి చేస్తానన్నారు.

ఈ కార్యక్రమం లో  సారిపల్లి కొండల రావు, డా. సి, ఆచార్య ఎల్లూరి శివారెడ్డిలు, రసమయి స్థాపకులు డా. ఎం. కే. రాము పాల్గొన్నారు. అంతకు ముందు యువనర్తకి అమృత పి. నాయర్ ప్రదర్శించిన కూచిపూడి నృత్యవిభావరి ప్రేక్షకులని ఆకట్టుకుంది.

 
Content Photo Gallery Back to Menu
Content Youtube Links Back to Menu
Amrutha P Nair Kuchipudi Dance i
Amrutha P Nair Kuchipudi Dance i
Rasamayi Founder Dr MK Ramu Spee
Dr. C.Narayana Reddy Speech at R
Smt DK Aruna Kumari Speech at Ra
Dr Murnalini Devi Speech in Rasa
Own Videos Back to Menu
No videos