|
|
First World Telugu History Conference on 14th & 15th July 2012 at London British Library ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో “ప్రథమ ప్రపంచ తెలుగు చరిత్ర మహోత్సవం” 14 & 15 జూలై 2012 లండన్ బ్రిటీష్ లైబ్రరీలో |
|
||||
First World Telugu History Conference on 14th & 15th July 2012 at Landon British Library
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో “ప్రథమ ప్రపంచ తెలుగు చరిత్ర మహోత్సవం” 14 & 15 జూలై 2012 లండన్ బ్రిటీష్ లైబ్రరీలో
తెలుగు వారి గురుంచి తొలిసారిగా విదేశీ గడ్డపైన జరిగిన ప్రపంచ మహాసభలు చరిత్ర రచనలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాయనీ, చారిత్రాత్మకంగా జరిగాయి. బ్రిటిష్ మ్యూజియం లోను, బ్రిటిష్ లైబ్రరీ లోను దక్షిణాసియా, ఆఫ్రికా అధ్యయన విభాగం లో తెలుగు వారికి సంబంధించిన చారిత్రక ఆధారాలు ఎక్కువగా ఉన్నాయి. తనతో పాటుగా 25 మంది చరిత్ర పరిశోధకులు వాటిని దగ్గరగా పరిశీలించి గలగటమే కాకుండా అక్కడ మనకు సంబంధించిన సమాచారం ఎంత మేరకు ఉందొ తెలుసుకునే అవకాశం ఈ పర్యటన వలన కలిగింది. మన ప్రభుత్వం, మన విశ్వ విద్యాలయాలు చొరవగా ముందుకొచ్చి చేయుతనిస్తే, అక్కడి రికార్డులకు, శాసనాలకు నకళ్ళు సంపాదించు కోగలిగే అవకాశం ఉంది. మన చరిత్ర ఎక్కడ పదిలంగా ఉందొ అక్కడికే చరిత్ర పరిశోధకులను తీసుకువెళ్ళి సదస్సు జరపటం అనేది ఒక ప్రశంసాత్మక విషయం. బ్రిటన్ లోని తెలుగువారందరూ కలిసి స్థాపించుకున్న తెలుగు సంస్థ యుక్తా (united kingdom Telugu Association) ఈ సభల నిర్వహణ ద్వారా తెలుగు ప్రజలలో చరిత్ర పట్ల ఒక సానుకూల దృష్టిని కలిగించగలిగింది. విదేశాలాలో తెలుగు సభలు అంటే సాంస్కృతిక కార్యక్రమాల వేడుకాగాను, ఒక ఉత్సవంగాను జరగటం అనే ఆనవాయితికి భిన్నంగా యుక్త సంస్థ తమ ద్వితీయ వార్షికోత్సవాన్ని ఇలా చారిత్రాత్మకంగా జరుపుకొంది. ఇందుకు భారతదేశంలో కర్త కర్మ క్రియగా వ్యవహరించిన ఈ సభల అధ్యక్షులు శ్రీ బుద్ధప్రసాదు, లండన్ లో యుక్తా సంస్థ వ్యవస్థాపకుడు శ్రీ కిల్లి సత్యప్రసాద్ లు ఆరు నెలల పాటు అపాహారం శ్రమించి, వ్యక్తిగతంగా ఈ ఘనతకు ప్రధాన కారకులయ్యారు. కాగా తమ స్వంత వృత్తి వ్యాపారాలను ప్రక్కన పెట్టి పనిచేసిన యుక్తా కార్యవర్గం, దూరాభారానికొర్చి, వార్థక్యాన్ని కుడా లెక్క చేయకుండా లండన్ వచ్చిన పరిశోధక బృందం ఈ సభలకు ప్రత్యేకతను తీసుకు వచ్చారు. సభలు విజయవంతం కావాలని బ్రిటిష్ ప్రధానమంత్రి ప్రత్యేక సందేశాన్ని పంపటం, అనేకమంది బ్రిటిష్ అధికారులు ఈ సదస్సులో పాల్గొనటం తెలుగు వారి పట్ల బ్రిటన్ ప్రభుత్వ ఆసక్తికి తార్కాణంగా కూడా భావిస్తున్నారు.
ప్రారంభసభ
లండన్ మహానగరంలో ప్రపంచ తెలుగు చరిత్ర మహాసభలు జూలై 14 ఉదయం వైభవోపేతంగా ప్రారంభమైనాయి. బ్రిటన్ విదేశంగా శాఖలో ఉన్న Alistrair James Hendrie Burt లాంఛనంగా సభలను ప్రారంభించారు. భారత్ బ్రిటన్లు మద్య బలమైన సాంస్కృతిక సంబంధాలు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. బ్రిటన్ అభివృద్దిలో తెలుగు వారి పాత్రను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. బ్రిటన్ దేశానికి శ్రీ అల్టిస్టయిర్ బర్ట్ ఆఫ్ఘనిస్తాన్, ధక్షిణాసియా, ఉత్తర అమెరికా, మద్య ఆసియా, ఉత్తర ఆఫ్రికాలకు సంబంధించిన మంత్రి 1983 నుంచి, మధ్యలో స్వల్ప కాలం మినహాయించి ఈ నాటివరకు పార్లమెంట్ సభ్యుడిగా, కన్జర్వేటీవ్ పార్టీ ప్రముఖుడిగా ఉన్న బార్ట్ గారు, భారతదేశంతో బ్రిటన్ సంబంధాలు బలపడటానికి ప్రభుత్వ పరంగా ప్రధాన కారకులు. ఆయన ఈ సభలో పాల్గొనటం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అలాగే, మరొక భారతీయుడు, హైదరాబాద్ లో పుట్టి పెరిగిన బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు, లార్డ్ Karan Faridoon Bilimoria, తన హైదరాబాద్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పార్సీ కుటుంబాలకు సంబంధించిన బిల్మోరియా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తిచేశారు. చార్టర్డ్ అకౌటేంట్ గా కూడా పని చేశారు. దాదాభాయి నౌరోజీ తరువాత బ్రిటన్ పాలమేంట్ కు ఎన్నికైన నాల్గవ పార్సీగాను, ఎగువ సభకు ఎన్నికైన తొలి పార్సీగానూ శ్రీ బిల్మోరియా గుర్తింపు పొందారు. భారతదేశం పట్ల, ముఖ్యంగా తెలుగు వారి పట్ల ప్రత్యేక అభిమానం కలిగిన బిల్మోరియా ఈ సభలలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
శ్రీ బుద్ధ ప్రసాద్ అధ్యక్షోపన్యాసం
యుక్తా సంస్థ, మరియు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం సంయుక్త అధ్వర్యంలో లండన్ లో రెండు రోజుల పాటు స్పూర్తిదాయకంగా జరిగిన తొలి ప్రపంచ తెలుగు చరిత్ర మహాసభలకు అధ్యక్షత వహించిన శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ తెలుగు ప్రజలకు, తెలుగ భాషా సంస్కృతులకు ఎనలేనీ సేవలందించిన ఆనాటి బ్రిటిష్ అధికారులకు పేరుపేరునా నివాళులర్పించారు. ఇది తెలుగు వారి చరిత్ర పునర్జీవ నోద్యమానికి ప్రారంభంగా ఆయన ప్రకటించారు. తరతరాల తెలుగు ప్రజల సంస్కృతినీ వికాసాన్ని నిలబెట్టేందుకు కోసం ఒక అంతర్జాతీయ వేదికని నిర్మించి, ఈ దిశగా మరిన్ని మహోన్నత కార్యక్రమాల నిర్వహణకు బాటలు వేసినందుకు "యుక్తా" సంస్థను ఆయన అభినందించారు. తెలుగు భాషా, తెలుగు సాహిత్యం, తెలుగు సంస్కృతి, తెలుగు వారి చరిత్రలకు సంబంధించి ఇంకా వెలుగులోకి రావాల్సిన ఎన్నో అపురూప గ్రంథాలు, రికార్డులు, డాక్యుమెంట్లు ఆనాటి బ్రిటిష్ అధికార్లు సేకరించి, పదిలపరచినవి ఈ బ్రిటిష్ లైబ్రరీలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, మన చరిత్రకు సంబంధించిన సాధికారిక సమాచారాన్ని క్రోడీకరించుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. అధిక వ్యయప్రయాసలకోర్చి ఈ తొలి ప్రపంచ చరిత్ర మహాసభలను సాక్షాత్తు బ్రిటీష్ గ్రంథాలయం ప్రాంగణం లోనే ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. స్వతహాగా మనలో చరిత్ర పట్ల అబిమానం తక్కువ కావటం వలన రామాయణ, భారతాల వంటివి మాత్రమే ఇతిహాసాలు గా మిగిలి, దేశ చరిత్రలు పదిలం కాకుండా పోయాయన్నారు. పొరుగు రాష్ట్రాల వారితో పోల్చినప్పుడు చరిత్ర రచనలో చేయాల్సిన కృషి ఇంకా ఎంతో ఉంది. రాజకీయపరమైన, సంస్కృతి పరమైన, భాషా పరమైన చరిత్రలను మన పరిశోధకులు పెద్దగా పట్టించుకోలేదు. మన చరిత్రని ఇతర భాషీయులకు తెలియజేసే ప్రయత్నాలు కూడా అరకొరగానే జరిగాయి. ఆ లోటును పూడ్చవలసిన అవసరం ఉందని అన్నారు.
గౌరవ అతిథి శ్రీ కొణిదల చిరంజీవి
సభకు గౌరవ అతిథిగా విచ్చేసిన రాజ్యసభ సభ్యులు శ్రీ కొణిదల చిరంజీవి తెలుగు భాషోద్యమం లో తాను కూడా భాగస్వామ్యం అవుతున్నాట్టు హర్షధ్వానాల మద్య ప్రకటించారు. తాను తన పిల్లలను తెలుగులోనే పెంచానని చెప్పారు. తెలుగు వాడై ఉండి, తెలుగు రాదని చెప్పుకోవడం కన్నా చావడం మేలని చెప్పిన కాళోజీ కవితను సభలో చదివి వినిపించారు. తెలుగు భాషకోసం జరిగే కార్యక్రమలన్నింటిలోనూ తానూ పాల్గొంటానన్నారు. శ్రీ వాడ్రేపు సుందర రావు ఏర్పాటు చేసిన తరతరాల తెలుగు జాతి చరిత్ర ఫోటో ప్రదర్శన, పర్యాటక శాఖ వారి హస్త కళల ప్రదర్శన. మారిషస్ కు చెందినా శ్రీ సంజీవ అప్పుడు రావి ఆకులమీద చిత్రించిన తెలుగు జాతి చరిత్ర ప్రదర్శనలను ఆయన రిబ్బను కత్తిరించి ప్రారంభించారు. ఈ మూడు ప్రదర్శనలు లండన్ లోని తెలుగు వారిని ఎంతగానో ఆకట్టుకొన్నాయి.
సభలో పాల్గొన్న ఇతర అతిథులు:
తొలుత, సభను ప్రారంభించిన శాసన మండలి అధ్యక్షులు శ్రీ చక్రపాణి తాను రచించిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చరిత్ర గ్రంథాన్ని ముఖ్య అతిథు ఆల్బర్ట్ బర్త్ ల చేతుల మీదుగా ఈ సభలో ఆవిష్కరించారు. దూరాభారమైనప్పటికీ లండన్ లో ఈ సదస్సును ఏర్పాటు చేయటానికి కారణం మన చరిత్ర అధిక భాగం ఇక్కడ పదిలంగా ఉండటమేనని, చరిత్ర పరిశోధకుల దృష్టిని ఇక్కడ కేంద్రీకరించాటానికి తగిన అనువైన వాతావరణాన్ని కల్పించటమేనని అన్నారు. కాటన్ మహాశయుని మునిమనుమడు శ్రీ రాబర్ట్ కాటన్ దంపతులను ఈ సదస్సులో ఘనంగా సత్కరించారు. శాసనమండలి సభ్యులు శ్రీ యాదగిరి రెడ్డి, శ్రీ ఇంద్రసేనా రెడ్డి, శ్రీ ఐలాపురం వెంకయ్య, శ్రీ జగదీశ్వరరెడ్డి, మలేషేయా తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీ అప్పుడు, పాండిచ్చేరి శాసన సభ్యుడు, మాజీ మంత్రి శ్రీ మల్లాది కృష్ణారావు, ప్రాచ్యలిఖిత సంస్థ సంచాలకులు, డా. సుబ్రహ్మణ్యం, ప్రభ్రుతులు ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 25 మంది చరిత్ర పరిశోధకులు, ఆచార్యులు, చరిత్ర రచయితలు రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సు లో పాల్గొన్నారు. మదినేని రామకృష్ణ. డా. ఈమని శివనాగిరెడ్డి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
లండన్ బ్రిటిష్ లైబ్రరీ ప్రదర్శన్
లండన్ చేరిన చరిత్ర పరిశోధకుల బృందం మొదటి రోజున శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారి నాయకత్వంలో ప్రపంచ ప్రసిద్ద బ్రిటిష్ లైబ్రరీని సందర్శించారు. ఒక విధంగా ఇది పుస్తకాల మ్యూజియం అనదగిన గొప్ప గ్రంథాలయ ఒక కోటీ ఎనభై లక్షల పుస్తకాలు ఇందులో భద్రపరచబడి ఉన్నాయి. వాటిలో ఆసియా ఆఫ్రికా అధ్యయన విభాగంలో ఈష్ట్ ఇండియా కంపెనీ రికార్డులు అసంఖ్యాకంగా ఉన్నాయి. భారతీయ భాషల విభాగం క్యురేటర్ శ్రీమతి నళినీ ప్రసాద్, లైబ్రరీ పౌరసంబంధాల అధికారి శ్రీ కెవిన్ మెహ్మేట్ మన పరిశోధకులకు దగ్గరుండి గొప్పగా సహకరించారు. గ్రంథాలయంలో ఎన్నో కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి. ఆన్ లైన్ లో పుస్తకాలను వెదికేందుకు ఆధునికరించబడిన ఎన్నో అవకాశాలు అక్కడ ఉన్నాయి. 1646 నుంచి ఈష్టిండియా కంపెని రికార్డులు సహా ఎన్నో గ్రంథాలు పరిశీలించవలసినవి ఉన్నాయి. తెలుగు జాతి చరిత్ర పరిశోధకులకు ఉపయోగించే ఎన్నో ఆధార గ్రంథాలు, పరిశోధనా పత్రాలు అక్కడ పదిలంగా ఉన్నాయి.
ముగింపు సభ:
ముగింపు సదస్సుకు బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు, లిబరల్ డెమోక్రాట్స్ డేప్యూటీ లీడర్ Si non Hughes ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు వారి చరిత్ర విశిష్టమైనదనీ, తెలుగు భాషా సాహిత్య వికాసాలకు సి పి బ్రౌన్ చేసిన కృషిని బ్రిటిష్ లైబ్రరి మన కళ్ళ కు కట్టించిందని ఆయన తన దేశంలో పేర్కొన్నారు. బ్రిటన్ లో తెలుగు వారు అత్యధిక సంఖ్యాకులు ఉన్నారని,ఈ దేశాభివృద్దిలో తెలుగు వారి పాత్ర ప్రదానమైనదనీ, స్వభాషా సంస్కృతులను కాపాడుకొనే ప్రయత్నం లో భాగంగా, తెలుగు వారు ఈ చారిత్రక మహాసభలు నిర్వహించటం ప్రశంస నీయమైనదనీ అన్నారు. స్పైమన్స్ హఘ్స్ సాంస్కృతిక రంగ ప్రియుడు, థేమ్స్నదీ ఉత్సవాలకు అధ్యక్షుడు ఫుట్ బాల్ క్లబ్బు కు నాయకత్వం వహిస్తున్నారు. బ్రిటన్లో నిరుద్యోగానికి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్లమెంటేరియన్ ఆయన పత్ర సమర్పకులు
ప్రముఖ చరిత్ర పరిశోధకులు, పురావస్తు శాస్త్ర వేత్తలు... డా. డి. రాజా రెడ్డి, డా. ఎన్.ఎస్. రామచంద్రమూర్తి, కూఛిభొట్ల శివ కామేశ్వర రావు, డా. శ్రీపాద సుబ్రహ్మణ్యం, డా. అట్లూరి మురళి, డా. బి సుబ్రహ్మణ్యం, డా. కృష్ణ నాయక్, డా. కిరణ్ కాంత్ చౌదరి, డా. చెన్నారెడ్డి, డా. ఈమని శివ నాగిరెడ్డి, డా. ఎమ్. ఎల్ కె మూర్తి, డా. ననుమాస స్వామీ, డా. జి.వి. పూర్ణచందు, డా. ముని రత్నం, నాయుడు, డా. అడపా సత్యనారాయణ, శ్రీ సంజీవ అప్పుడు(మారిషస్), డా. సుదర్శన్ రావు, ప్రభ్రుతులు పత్ర సమర్పణలు చేశారు. తెలుగు ప్రాచీన వ్రాత ప్రతులగురుంచి, తెలుగు వారి ఆహార చరిత్ర గురుంచి, తెలుగు జాతి ప్రాచీనత గురుంచి వక్తలు పరిశోధనా పత్రాలు సమర్పించారు. రానున్న కాలంలో తెలుగు చరిత్ర రచన కొత్త పుంతలు తోక్కనున్నదని ఆశాభావం వెలిబుచ్చారు. జాత్యభిమానంతో చరిత్ర పరిశోధనా సాగాలని కోరుకొన్నారు.
సాంస్కృతిక ప్రదర్శనలు
మొదటి రోజు శ్రీ వాడ్రేపు సుందర రావు చేసిన శిఖండి ఏకపాత్రాభినయం,రెండవ రోజు ప్రముఖ నృత్య కళాకారిణి శ్రీమతి పద్మజారెడ్డి బృందం చేసిన నాట్య ప్రదర్శనలు సభికులను అలరించాయి.
నిర్వాహకులు
యుక్తా సంస్థ అధ్యక్షులు శ్రీ కాజ ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి శ్రవణ్, కార్యదర్శి శ్రీ మంత్రాల ప్రసాద్, ట్రష్టిలు శ్రీ గుంటుపల్లి జయకుమార్, డా. పద్మ నరేంద్ర, ప్రమోద్, శ్రీ మల్లేశం ప్రభ్రుతులు ఆరునెలలపాటు శ్రమకోర్చి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అతిథి సత్కారాలు, వసతి ఏర్పాట్లు, సభా నిర్వహణలన్నీ ఎలాంటి లోటు లేకుండా చేశారు.
ప్రథమ ప్రపంచ తెలుగు చరిత్ర మహాసభలు-తీర్మానాలు
• భాషా జాతీయులుగా తెలుగు ప్రజల మహోన్నత చరిత్రనీ, తెలుగు సంస్కృతే ప్రాచీనతనీ, తెలుగు భాష విశిష్ట ప్రాచీన సంపన్నతనీ చాటి చెప్పిన తెలుగు చరిత్ర మహాసభలను వైభవోపేతంగాను, ప్రయోజనాత్మకంగానూ, నిర్వహించిన యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు అసోసియేషన్-యుక్తా, లండన్ సంస్థ వారి నిరుపమాన కృషిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఏకగ్రీవంగా తీర్మానించింది.
• తెలుగు చరిత్ర పునర్జీవనోద్యమానికి ఈ మహాసభలు శ్రీకారం చుట్టాయి. అందుకు కారకులైన అతిథులు, పరిశోధకులు అందరికి ఈ సదస్సు అభివాదాలు తెలిపింది.
• వేల సంవత్సరాల మహోన్నత చరిత్ర కలిగిన జాతి మనది. మన చరిత్రను పరిరక్షించుకొంటూ, చరిత్ర నేర్పుతున్న పాటాలను గ్రహించుకోంటూ, జాతి పురోగమనానికి బాటాలు వేయాల్సిన బాధ్యతను గుర్తెరిగేలా స్పూర్తి సందేశాన్ని ఈ మహాసభలు అందిస్తున్నాయి. ఈ ఆశయాలు సాధించేందుకు అంతర్జాతీయ స్థాయిలో ఒక తెలుగు వేదికను ఏర్పాటు చేయాలనీ ఈ సభ తీర్మానిస్తోంది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి ఈ సభలు నిర్వహించాలని ఇందుకు, భవిష్యత్ కార్యాచరణ బాధ్యతను మహాసభ అధ్యక్షులు శ్రీ మండలి బుద్ద ప్రసాదుకు అందిస్తూ, ఏకగ్రీవంగా తీర్మానించారు.
• భాష ద్వారానే ఒక జాతి ఏర్పడుతుంది. జాతి అస్తిత్వాన్ని నిలుపుకోవటానికి మాతృ భాషనూ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు ప్రాచీనతను నిరూపించే పరిశోధనలు జన బాహుళ్యం లోకి తీసుకురావటం ద్వారా, భాషాభిమానాన్ని, జాత్య భిమానాన్ని, తెలుగు ప్రజలలో ప్రేరేపించవలసిన అవసరాన్ని ఈ మహాసభ గుర్తిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించింది.
• తరతరాల తెలుగు సాంఘిక, సాంస్కృతిక చరిత్ర రంగాలకు సంబంధించిన పరిశోధనలను మరింత ముమ్మరం చేయాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ, ఇందుకు అందరం అండగా నిలవాలని పిలుపు నిచ్చింది.
• తెలుగు జాతి చరిత్రను ప్రాధమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయి విద్యలలో బోధించటం ద్వారా జాతి ఆస్తిత్వాన్ని కాపాడేందుకు రేపటి తరానికి ప్రేరణ నివ్వాల్సిన అవసరాన్ని, చరిత్ర బోధన అవస్యకతనీ నొక్కి చెప్తూ ఈ మహాసభ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
• తెలుగు నాట ఉన్న పురావస్తు, చారిత్రక నిర్మాణాలను, శిథిలాలను పరిరక్షించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం తగు చర్యలు చేపట్టాలని, పురావస్తు శాఖను పటిష్టపరచి పూర్తి స్థాయి సిబ్బందిని నియమించాలని, నిధులు విధులు విడుదల చేయాలనీ ప్రభుత్వాన్ని గట్టిగా కోరారు. దేశ వ్యాప్తంగా లభ్యమైన తెలుగు వారి శాసనాలు, ఇతర చారిత్రక ఆధారాలు సమీకరించటం, వాటిని తెలుగు లిపిలో అందరికి అర్థం అయ్యేలా వివరణలు వ్రాయించాలని ఈ మహాసభ ప్రభుత్వ మరియు స్వచ్చంద సంస్థలను కోరింది.
• లండన్ బ్రిటిష్ లైబ్రరీలో తెలుగు వారికి సంబంధించిన ఎన్నో గ్రంథాలు, ఆనాటి పత్రికలు, క్రైస్తవ మిషనరీలు, సైనిక, పౌర అధికారుల నివేదికలు, అలాగే బ్రౌన్, మెకంజీ, మన్రో ప్రభ్రుతుల వ్రాతప్రతులు, తెలుగుపత్రికల నకళ్ళు తీసేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని అలాగే ఇప్పటివరకు ఆంద్రప్రదేశ్ లో లభ్యం కానివి లండన్ లో గుర్తించిన వాటిని డిజిటల్ పద్దతిలో కాపీలు తెచ్చుకొనే ఏర్పాటు చూడవలసినదిగా కోరుతూ తీర్మానించాటమైనది. తీర్మానాలను లండన్ తెలుగు ప్రముఖులు డా. మదినేని రామకృష్ణ ప్రవేశపెట్టి సభ ఆమోదం తీసుకొన్నారు.
తెలుగు జాతి సమగ్ర చరిత్ర నిర్మాణం కోసం అంతర్జాతీయ స్థాయిలో జరగవలసిన కృషి, చేపట్టనున్న చర్యల గురించి ఒక సమగ్ర కార్యాచరణ రూపొందించుకోవాల్సిన సమయం ఇది. తెలుగు భాష మరియు భాషా జాతీయులుగా తెలుగు ప్రజలు చరిత్రలు చాలా ప్రాచీనమైనవే నిరూపణలు అనేకం వెలుగులోకి వస్తున్న నేపధ్యంలో అంతర్జాతీయ తెలుగు చరిత్ర సదస్సు ఒక చారిత్రక అవసరం అయ్యింది. బ్రిటన్ లోని తెలుగు సంస్థలు ఇందుకు ముందుకు రావడం తో ప్రధమ ప్రపంచ తెలుగు చరిత్ర మహాసభలు లండన్ లో నిర్వహించాలని సంకల్పించడం జరిగింది.
ప్రధమ ప్రపంచ తెలుగు చరిత్ర మహాసభల లక్ష్యాలు
తెలుగు భాష ప్రాచీనతను, తెలుగు ప్రజల ప్రాచీనతను నిరూపిస్తూ సమగ్ర తెలుగు జాతి నిర్మాణం కోసం విశ్వవిద్యాలయాల పరంగాను, ప్రభుత్వపరంగానూ, మేథో వర్గాల పరంగానూ చేయదలచిన కృషి గురించి ఒక కార్యాచరణ రూపొందించటం.
తెలుగు భాష గ్రావిడ భాషా కూటమికి చెందినది కావచ్చని ప్రతిపాదించిన ఫాన్సిస్ వైత ఎల్లిస్, ది స్టడీ అఫ్ లివింగ్ లాంగ్వేజెస్ గ్రంథ రచయిత, కృష్ణా గోదావరి డెల్టాల నిర్మాత సర ఆర్థర్ కాటన్, తెలుగువారి చరిత్రకు ఒక దిశా నిర్దేశం చేసిన కాలిన్ మెకంజీ, తెలుగు సారస్వతాన్ని సుసంపన్నం చేసిన చార్లెస్ ఫిలిఫ్ బ్రౌన్, (సిపి బ్రౌన్) బౌద్ధ శిల్పాలలోని నాగ జాతి ప్రజల గురించి విలువైన విషయాలను వెలుగు లోకి తెచ్చిన సెర్బుసన్, చిరస్మరణీయులైన థామస్ మండ్రో, అలేగ్జాండర్ క్యాంప్ బెల్, కాల్డ్ వెల్, విలయం కెరీ, ప్రొఫెసర్ హాల్డెన్, డ్యురాంట్ మొదలైన ప్రముఖులు పదిలపరచిన చారిత్రక సంపదల గురించి పరిశోధనాత్మక సదస్సులు నిర్వహించటం.
పురావస్తు పరిశోధనలకు సంబంధించి ప్రచురింపబడని నివేదికలు బ్రిటిష్ రికార్డులలో భద్రంగా ఉన్న వాటిని వెలుగులోకి తీసుకురావటం బ్రిటిష్ కాలంలో పరిష్కరించబడిన శాసనాలు, నాణేల నమూనాలు తెలుగునాట ప్రస్తుతం లభ్యం కాకుండా ఉన్నాయి.
బ్రిటిష్ మ్యూజియం తదితర పరిశోధనాగారాల్లోంచి వెలుగులోకి తేవటం బ్రిటిష్ యుగం నాటి పాలనా పరమైన నివేదికలు, ఇఅతర విదేశీ జాతుల నివేదికలు కొన్ని మాత్రమే మన రాష్ట్ర ఆర్కైవ్స్ లో ఉండగా అధిక శాతం బ్రిటన్ లోనే ఉన్నాయి. వాటిని పరిశీలించి అధ్యయనం చేయటం.
ఇప్పటి వరకు గ్రంథస్థం కాని పరిశోధనలెన్నో తెలుగువారి ప్రాచీనతను నిరూపిస్తున్నవి, ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. మన దృష్టికి రాని ఎన్నో విషయాలను తెలుసుకొనే ప్రయత్నం చెయ్యటం.
బ్రిటన్ లోని వివిధ విశ్వావిద్యాలయాల్లో తెలుగు వారి చరిత్ర గురించి జరిగిన పరిశోధన లను అధ్యయనం చేయటం.
బ్రిటన్ లోని తెలుగువారి భాషా సంస్కృతుల గురించి పరిశీలన చేయటం, తెలుగు భాష, సంస్కృతులను ప్రాచీన మధ్య, ఆధునిక యుగాల చరిత్రలను సమగ్రంగా అధ్యయనం చేయటానికి బ్రిటన్ లో ఇప్పటికీ పదిలంగా ఉన్న అంశాలను పరిశీలించటానికి ఈ సదస్సు ఒక అవకాశం కల్పించగలదని ఆశిస్తున్నాం.

No videos

World Telugu History Conferences at London 19
Mandali Buddha Prasad at World Telugu History Conferences at London 6
World Telugu History Conferences at London 2
Mandali Buddha Prasad & Chiranjeevi at World Telugu History Conferences at London 3
Mandali Buddha Prasad & Chiranjeevi at World Telugu History Conferences at London
Mandali Buddha Prasad Speech at World Telugu History Conferences at London
World Telugu History Conferences at London 9
World Telugu History Conferences at London 18
Mandali Buddha Prasad at World Telugu History Conferences at London 3
World Telugu History Conferences at London 21
World Telugu History Conferences at London 20
World Telugu History Conferences at London 8
World Telugu History Conferences at London 6
World Telugu History Conferences at London 23
World Telugu History Conferences at London 17
World Telugu History Conferences at London 14
World Telugu History Conferences at London 10
Mandali Buddha Prasad at World Telugu History Conferences at London 2
Dr Chiranjeevi at World Telugu History Conferences at London
Mandali Buddha Prasad at World Telugu History Conferences at London
World Telugu History Conferences at London 16
Mandali Buddha Prasad Speech at World Telugu History Conferences at London 2
World Telugu History Conferences at London
Mandali Buddha Prasad & Chiranjeevi at World Telugu History Conferences at London 2
World Telugu History Conferences at London 7
Mandali Buddha Prasad at World Telugu History Conferences at London 5
World Telugu History Conferences at London 22
World Telugu History Conferences at London 3
World Telugu History Conferences at London 15
World Telugu History Conferences at London 4
Chiranjeevi Speech at World Telugu History Conferences at London
World Telugu History Conferences at London 13