Female Story Writers  మహిళా కథా రచయితలు Male Story Writers  పురుష కథా రచయితలు
ప్రపంచ తెలుగు మహా సభలు డిసెంబర్ 2012లో తిరుపతిలో జరగనున్నాయి.
Mahakavi Seshendra 5th Death Anniversary Program on 30th May 2012 at Kala Subbarao Kala Vedika కళా సుబ్బారావు కళా వేదికలో మహాకవి శేషేంద్ర 5వ వర్థంతి కార్యక్రమం
G. Satyaki, S/o G. Seshendra Sharma
32 Janata Flats, Kanti Shikara Complex,
Punjagutta


Contact: 7702964402, 9441070985
Hyderabad
Pin: 500082
Content Text Back to Menu

Mahakavi Seshendra 5th Death Anniversary Program on 30th May 2012 at Kala Subbarao Kala Vedika

కళా సుబ్బారావు కళా వేదికలో మహాకవి శేషేంద్ర 5వ వర్థంతి కార్యక్రమం


గుంటూరు శేషేంద్ర శర్మ మెమోరియల్ ట్రస్ట్, శ్రీ త్యాగరాయగానసభ సంయుక్త ఆధ్వర్యంలో మహాకవి శేషేంద్ర 5వ వర్థంతి కార్యక్రమం 30 మే 2012న శ్రీ త్యాగరాయగానసభలోని కళా సుబ్బారావు కళా వేదికలో ఘనంగా జరిగింది.

శేషేంద్ర
శర్మ రచించిన విశ్వ వివేచనపుస్తకాన్ని ముఖ్య అతిథి ఆవిష్కరించగా, సినీ గేయ రచయిత డా. వెనిగళ్ళ రాంబాబు ఈ పుస్తకాన్ని పరిచయం చేశారు.

కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి విచ్చేశారు. కవి, విమర్శకులు శ్రీ తిరునగరి అధ్యక్షత వహించిన ఈ సభలో ప్రముఖ వాగ్గేయకారులు శ్రీ గోరటి వెంకన్న స్మారకోపన్యాసం చేశారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాళ్ళబండి కవితాప్రసాద్ మాట్లాడుతూ

శేషేంద్ర శర్మ పలు కావ్యాలతో పాటు కవితలు, విమర్శనాత్మక వ్యాసాలూ రాసి తెలుగు సాహిత్య లోకాన్ని సుసంపన్నం చేశారని అన్నారు. ఈ సందర్భంగా విశ్వవివేచన పుస్తకాన్ని రాళ్ళబండి కవితా ప్రసాద్ ఆవిష్కరించారు.

ప్రముఖ కవి డాక్టర్ తిరునగరి మాట్లాడుతూ

తెలుగు కవితకు చిరునామా శేషేంద్ర అని అన్నారు. ఆయన ప్రపంచ కవుల సాహిత్యాన్ని చదివి వాటిని తెలుగులోకి అనువదించి అందులోని సారాంశాన్ని సాహితీ మూర్తులకు పంచి పెట్టారని అన్నారు. తెలుగు సాహిత్య లోకంలో మహాకవిగా చెప్పుకోదగ్గ కవి శేషేంద్ర అని ఆయన పేర్కొన్నారు.

కార్యక్రమంలో

పుస్తక పరిచయం డాక్టర్ వెనిగళ్ళ రాంబాబు,

ఆత్మీయ అతిథిగా త్యాగరాయగానసభ అధ్యక్షులు శ్రీ కళా వెంకట దీక్షితులు,

విశిష్ట అతిథులుగా డా. ముక్తేవి భారతి,

డా. శారదా అశోకవర్థన్,

డా. బి. జయరాములు,

శ్రీమతి మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

 

 
Content Photo Gallery Back to Menu
Content Youtube Links Back to Menu
Own Videos Back to Menu
No videos