|
|
World Telugu Conference press meet at Ravindra Bharathi on 9th August 2012 రవీంద్రభారతిలో ఘనంగా జరిగిన ‘ప్రపంచ తెలుగు మహా సభల’ నిర్వహణ ఏర్పాట్లపై సమావేశం |
|
||||
World Telugu Conference Press Meet at Ravindra Bharathi on 9th August 2012
‘ప్రపంచ తెలుగు మహా సభల’ నిర్వహణ ఏర్పాట్లపై సమావేశం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా సాంస్కృతిక సంస్థల ప్రతినిధుల సమావేశం రవీంద్రభారతిలో 9 ఆగష్టు 2012న ఘనంగా జరిగింది. తిరుపతిలో డిసెంబర్ 27 నుంచి 29 వరకు జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ఏర్పాట్ల గురించి ఈ సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి వట్టి వసంతకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని పర్యాటక క్యాలెండర్ ను ఆవిష్కరించారు. సమావేశంలో సాంస్కృతిక మండలి చైర్మన్ ఆర్.వి. రమణమూర్తి, మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్, సాంస్కృతిక శాఖ సలహాదారు కేవి రమణాచారి, సాంస్కృతిక శాఖ సంచాలకులు రాళ్లబండి కవితాప్రసాద్ ప్రతినిధులుగా పాల్గొన్నారు.
మంత్రి వట్టి వసంతకుమార్ మాట్లాడుతూ
తెలుగు వారికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చేందుకు భావితరాలకు భాషా వికాసానికి మార్గదర్శకత్వం చేసేందుకు డిసెంబర్ లో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నామని, ఈ సభల లోగోను ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి 15 ఆగష్టు 2012న ఆవిష్కరిస్తారని అన్నారు. గ్రామ, మండల, జిల్లా కేంద్రాల్లో ముందుగా చైతన్య సభలను ఏర్పాటు చేస్తామని, విద్యార్థులతో కళాయాత్రలు, కవిత్వం, క్విజ్, నాటిక పోటీలను నిర్వహిస్తామని చెప్పారు. తెలుగు మరిచిపోతున్న ఈ తరుణంలో కొత్త చైతన్యం తెచ్చేందుకు తెలుగు మహాసభలు ఒక చారిత్రక ఆవశ్యకత అని అన్నారు.
సాంస్కృతిక మండలి చైర్మన్ ఆర్.వి. రమణమూర్తి మాట్లాడుతూ
తెలుగు వారి వైభవాన్ని చాటే ఈ ప్రపంచ తెలుగు మహాసభల విజయానికి ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు.
మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ
తెలుగు భాషా వికాసం, మాతృభాషా ప్రకాశం అనే నినాదంతో ఈ సభలను నిర్వహిస్తున్నామని అన్నారు.
కార్యక్రమంలో జె. బాపురెడ్డి, ఢిల్లీ నాగరాజు, వంశీ రామరాజు, అభినందన భవాని, కోవెల సుప్రసన్నాచార్య, డా. శరత్ జ్యోత్స్నా రెడ్డి, ఆశాలత, మాస్టార్జీ, బాదాంగిరిసాయి, ప్రజానాట్యమండలి రమేష్, జొన్నవిత్తుల, పతివాడ సూర్యనారాయణ, డా. భిక్షపతి, సుద్దాల భారతి తదితరులు పాల్గొన్నారు.

No videos

World Telugu Conference Press Meet at Ravindra Bharathi 6
World Telugu Conference Press Meet at Ravindra Bharathi 4
KV Ramana Chary Speech in World Telugu Conference Press Meet
Rallabandi Kavitha Prasad Speech in World Telugu Conference Press Meet
World Telugu Conference Press Meet at Ravindra Bharathi 7
RV Ramanamurthy Lighting Lamp in World Telugu Conference Press Meet
World Telugu Conference Press Meet at Ravindra Bharathi 3
World Telugu Conference Press Meet at Ravindra Bharathi 5
Mandali Buddha Prasad Lighting Lamp in World Telugu Conference Press Meet
World Telugu Conference Press Meet at Ravindra Bharathi 2
Vatti Vasanth Kumar in World Telugu Conference Press Meet
Mandali Buddha Prasad Lighting Lamp in World Telugu Conference Press Meet 4
Mandali Buddha Prasad Lighting Lamp in World Telugu Conference Press Meet 3
Vatti Vasanth Kumar in World Telugu Conference Press Meet 2
Vatti Vasanth Kumar Speech in World Telugu Conference Press Meet
Mandali Buddha Prasad Speech in World Telugu Conference Press Meet
Vatti Vasanth Kumar Lighting Lamp in World Telugu Conference Press Meet
World Telugu Conference Press Meet at Ravindra Bharathi