Female Story Writers  మహిళా కథా రచయితలు Male Story Writers  పురుష కథా రచయితలు
ప్రపంచ తెలుగు మహా సభలు డిసెంబర్ 2012లో తిరుపతిలో జరగనున్నాయి.
All Telugu Literary Oraganizations-తెలుగు సాహితీ సంస్థలు »
Kala Prapurna Gidugu Ramamurthy Jayanthi Aathimya Purskaralu కళాప్రపూర్ణ గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి స్వర్ణోత్తర శతాబ్ది జయంతి మహోత్సవం





Content Text Back to Menu
Kala Prapurna Gidugu Ramamurthy Jayanthi Aathimya Purskaralu

కళాప్రపూర్ణ గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి స్వర్ణోత్తర శతాబ్ది జయంతి మహోత్సవం



స్పూర్తి సాంస్కృతిక సేవా సంస్థ వారి అధ్వర్యంలో వ్యావహారిక భాషోద్యమ నాయకులు, సవర భాషా వాగానుశాసనులు , రావుసాహెబ్, కైజర్ – ఇ – హింద్, మహోపాధ్యాయ ‘కళాప్రపూర్ణ’ గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి స్వర్ణోత్తర శతాబ్ది జయంతి మహోత్సవం ఆగష్టు 31 న సాయంత్రం 6.00 గంటలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లోని ఎన్.టి.ఆర్. కళామందిరం లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జ్ఞానపీఠ్, పద్మభూషణ్ అవార్డుల గ్రహీత డా|| సి. నారాయణ రెడ్డి గారు హాజరయ్యారు. సభాధ్యక్షులుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు వ్యవహరించారు. రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షులు సంచాలకులు డా|| రాళ్ళబండి కవితాప్రసాద్ గారు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.

సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు డా|| వాడ్రేపు చినవీరభద్రుడు గారు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. డైరెక్టర్ (వి & ఎస్) & డి.ఐ.జి.పి. , ఐ.పి.ఎస్. శ్రీ వి.వి. శ్రీనివాసరావు గారు, ఆంధ్రాబ్యాంక్ జనరల్ మేనేజర్ శ్రీ టి.వి.ఎస్. చంద్రశేఖర్ గారు, సిలికానాంధ్ర అధ్యక్షులు డా|| కూచిబొట్ల ఆనంద్ గారు, అభినయ అధ్యాపకులు శ్రీ దీక్షిత్ డి.ఎస్. గారు, కళాపోషకులు లయన్ పి. జయప్రకాష్ రెడ్డి గారు మరియు గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి మునిమనుమరాలు శ్రీమతి స్నేహలతామురళి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి మనుమలు శ్రీ గిడుగు రాజేశ్వరరావు, శ్రీ గిడుగు రామకృష్ణ గార్లకు జయంతి పురస్కార ఆత్మీయ సత్కారం చేశారు. అదేవిధంగా ఘట్టి కృష్ణముర్తి గారి శిష్యులు అయిన ఇందిరప్రియదర్శిని, ప్రహర్షిత, కోషాల్, దీపిక, తన్మయ్, కార్తీక్, ఇషా అగర్వాల్ గార్లచే పద్యపఠనం కార్యక్రమాన్ని నిర్వహించారు. మరియు కీ||శే|| పానుగంటి లక్ష్మీనారాయణ ‘సాక్షి’ వ్యాసాలనుండి స్వభాష నాటిక ప్రదర్శన నిర్వహించారు. ఈ నాటకానికి దీక్షిత్ డి.ఎస్. దర్శకత్వం వహించగా బుర్రా సుబ్రహ్మణ్యం శాస్త్రి, ఉత్తేజ్ , దీక్షిత్ డి.ఎస్. మధుసూదన్, మురళి గారు నాటకీకారణ చేశారు.
 
Content Photo Gallery Back to Menu
Content Youtube Links Back to Menu
Own Videos Back to Menu
No videos