Female Story Writers  మహిళా కథా రచయితలు Male Story Writers  పురుష కథా రచయితలు
ప్రపంచ తెలుగు మహా సభలు డిసెంబర్ 2012లో తిరుపతిలో జరగనున్నాయి.
Navakavitha Jaldhi Dasarathi Book Released నవకవితా జలధి దాశరథి పుస్తకావిష్కరణ





Content Text Back to Menu
నవకవితా జలధి-దాశరథి పుస్తకావిష్కరణ

2 జూలై 2011న శ్రీ త్యాగరాయగానసభలో కిన్నెర ఆర్ట్ థియేటర్స్ డాక్టర్ ద్వానాశాస్త్రి రచించిన ‘నవకవితా జలధి-దాశరథి’ గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ సభకు సుప్రసిద్ధ కవి, శతావధాని డా.రాళ్లబండి కవితాప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సభకి కిన్నెర ఆర్ట్ థియేటర్స్  వ్యవస్థాపకులు మద్దాలి రఘురామ్ గారు స్వాగతం పలికారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి డా.కె.వి.రమణ ఈ పుస్తకాని ఆవిష్కరించి ప్రసంగిస్తూ మహాకవి దాశరథి, భావకవి, అభ్యుదయకవి, ఉద్యమకవి ఆధ్యాత్మిక కవి అని అన్నారు. దాశరథి ఎన్నో కోణాలలో కవిత్వాన్ని సామాన్యుడుకి సైతం అర్థం మైనరీతిలో వ్రాసి జనరంజకం చేసి భావితరాల కవులకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. ‘నవకవితా జలధి-దాశరథి’ గ్రంథ రచయిత డా. ద్వానాశాస్త్రి ఈ పుస్తకంలో దాశరథి జీవిత, సాహితీ విశేషాలను విన్నూత్న కోణంలో రాసారని అన్నారు.

అధ్యక్షత వహించిన డా. రాళ్లబండి కవితాప్రసాద్ దాశరథి గారి సాహిత్యం వంశ పారంపర్యంగా వచ్చిందని దానిని ఆయన ఉద్యమంగా నడిపించారని అన్నారు. ఈ సభలో  విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రసార భారతి దూరదర్శన్ హైదరాబాద్ పూర్వపు డైరెక్టర్ డా.మధుసూదన్ రావు గారు తాను పనిచేసిన ఆకాశవాణిలో కవిసమ్మేళనాల నాటి దాశరథి పరిచయాన్ని, ఆత్మీయతని వివరించారు.

ఈ సభలో డా.ద్వానాశాస్త్రి తన కృతిని శ్రీమతి దాశరథి లక్ష్మి గారికి అంకితం చేశారు. ఈ గ్రంథావిష్కరణ అనంతరం తన స్పందనలో డా.ద్వానాశాస్త్రి ఈ పుస్తకం తనని రాయమని సి.పి. బ్రాన్ అకాడమీ కోరినప్పుడు ఇంత గురుతర భాద్యతను ఎలా నిర్వహించాగలను? అని ఆవేదన చెందానని, అయితే దాశరథి గారిపై అంతకుముందు రాసిన పరిశోధన పుస్తకాలని అధ్యయనం చేసి ఆయన కుటుంబ సభ్యుల సహకారంతో ఈ నవకవితా జలధి-దాశరథి గ్రంథాని రాసానని అన్నారు.

 
Content Photo Gallery Back to Menu
Content Youtube Links Back to Menu
Navakavitha Jaldhi Dasarathi Boo
Navakavitha Jaldhi Dasarathi Boo
Navakavitha Jaldhi Dasarathi Boo
Navakavitha Jaldhi Dasarathi Boo
Own Videos Back to Menu
No videos