Female Story Writers  మహిళా కథా రచయితలు Male Story Writers  పురుష కథా రచయితలు
ప్రపంచ తెలుగు మహా సభలు డిసెంబర్ 2012లో తిరుపతిలో జరగనున్నాయి.
Gaddar Honored with People War Ship గద్దర్ కు ప్రజా యుద్ధ నౌక పురస్కారం


Suddala Vill,


Nalgonda
Pin: 508001
Content Text Back to Menu
Gaddar Honored with People War Ship

గద్దర్ కు ప్రజా యుద్ధ నౌక పురస్కారం


విఖ్యాత ప్రజా కవి సుద్దాల హనుమంతు జానకమ్మ దంపతుల పేరుమీద వారి కుమారుడు ప్రముఖ సినీ కవి శ్రీ సుద్దాల అశోక్ తేజ సుద్దాల ఫౌండేషన్ 13 అక్టోబర్ 2010న ప్రారంభించారు.  ఈ ఫౌండేషన్ న్ని జానపద కళాపీఠంగా రూపుదిద్ది ఎందరో కళాకారులని, ప్రజాకవులని, సామాజిక అభ్యున్నతకి తోర్పడే వారినేవరినైన అయన సత్కరిస్తూ వచ్చారు.

ఈ ఏడాది 13 అక్టోబర్ 2011 నాడు రవీంద్రభారతిలో శ్రీ అశోక్ తేజ సుప్రసిద్ధ ప్రజా కవి శ్రీ గద్దర్ ని (ప్రజా యుద్ధ నౌక) అనే బిరుదుతో ఘనంగా సత్కరించారు. ఈ సభాకార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జ్ఞాన్ పీఠ్  అవార్డు గ్రహీత డా.సి.నారాయణ రెడ్డి ప్రసంగిస్తూ స్వాతంత్ర్య సమర పోరాటంలో తెలంగాణ ప్రజలను తన ఆలవోకగా వచ్చిన జానపదంతో చైత్యన పరిచి ఉత్తేజితులను చేశారని, ఆయన కవిత్వం జనం నోట వినిపిస్తూ వచ్చిందని అన్నారు. సుద్దాల హనుమంతు సన్మానాలకి, సత్కారాలకి దూరంగా ఉంటూ సమాజాన్ని ముందుకు నడిపించారని అన్నారు. ఈనాటి పురస్కార గ్రహీత శ్రీ గద్దర్ ఊహించని జనపదంతో పాటలు రాసి ఎంతో మంది గద్దర్ లని తయారు చేసిన అక్షర వీరుడని అభి వర్ణించారు.

ఈ సభాకర్యక్రమానికి స్వాగతం పలుకుతూ శ్రీ సుద్దాల అశోక్ తేజ తన తండ్రి గారి ఆదర్శాలని, భావాలని ఇలా పది కాలాలు ఉంచడమే తన భాధ్యతని అన్నారు. ఈ సుద్దాల ఫౌండేషన్ కి తన ఆదాయంలో సగం ధనాన్ని ఇస్తూ మున్ముందు మరెన్నో సామాజిక సృహ ఉన్న కార్యక్రమాలు చేస్తానని చెప్పారు.

ప్రజా యుద్ధ నౌకగా పురస్కారాన్ని అందుకున్న గద్దర్ స్పందిస్తూ సాహిత్యం, సామాజిక సృహకి ఆజ్యం పోయాలని అన్నారు. చర్చలు, సాహితీ గోష్టులు, కవిత్వం, చరిత్రనైనా, వాస్తవాన్ని అయినా ప్రతిబింబించాలని చెప్పారు. ప్రకృతిలో భూమి, నీరు ఇలాంటి వస్తువులని కాపాడుతూ వస్తున్న కష్టపడే బడుగు వర్గాల వారిని ముందుకు నడిపించాలని అన్నారు. కవిత్వం కష్టాలకి, సత్యాలకి ప్రచారం చేయగలిగేది కేవలం చదువు కున్న వాళ్ల దగ్గరేనని కాని ఓ ప్రజా కళా కారుడుగా తను పెర్ ఫార్ మెన్స్ థియేటర్ మార్గాన్ని ఎంచుకున్నానని అందుకే కలం నుంచి గళం నుంచి తన పాటని ప్రజల మధ్య ఉంచగాలుగు తున్నాను అని అన్నారు. ప్రకృతి, సమాజం ఆలోచన ఇవి సిద్ధాంతాలుగా మిగలకుండా వాస్తవంలో ప్రాక్టికల్ గా మారేందుకు చేస్తున్న తన ప్రయత్నానికి ప్రేరణన సుద్దాల హనుమంతు, నాజర్ గార్లేనని అన్నారు.  

ఈ సభలో ఆర్.నారాయణ మూర్తి, పాశం యాదగిరి, జయధీర్ తిరుమలరావ్, గానగాని అయిలయ్య, మబ్బు ఎల్లయ్య, సుద్దాల సుధాకర్, సుద్దాల భారతి, సినీ నటుడు ఉత్తేజ్, ఆకుపత్ని సత్యనారాయణ మరియు తదితరులు పాల్గొన్నారు.

 
Content Photo Gallery Back to Menu
Content Youtube Links Back to Menu
Gaddar Honored with People War S
Doom Dam Dance in Gaddar Honored
Own Videos Back to Menu
No videos